ఘనంగా సాగిన బెల్లంపల్లి ఎమ్మెల్యే ముందస్తు జన్మదిన వేడుకలు

రిపోర్టర్: PRASAD స్థలం: బెల్లంపల్లి

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి ముందస్తు జన్మదిన వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు బండి ప్రభాకర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు పిన్నింటి రఘునాథ్రెడ్డి, టీపీసీసీ సభ్యుడు చిలుముల శంకర్, కౌన్సిలర్ చింతల వసంతతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని కేక్ కట్ చేసి ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలిపారు.