తంపటాపల్లి ఎంపీటీసీ ప్రచారంలో జోరు పెంచిన టీడీపీ అభ్యర్థి వరలక్ష్మి
రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్
స్థలం: పాలకొండ
పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ మండలం తంపటాపల్లిలో ఎంపీటీసీ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని గొర్లె వరలక్ష్మి ఇంటింటికీ తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. కూటమి ప్రభుత్వంలోనే గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని నాయకులు పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో తనను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు.