ది ప్యారడైజ్ చిత్రంలో నా పాత్ర చాలా వైవిధ్యంగా ఉంటుంది
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: హైదరాబాద్
న్యాచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ది ప్యారడైజ్ సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రంలో సుబ్బలక్ష్మి అనగా సుబ్బు అనే కీలక పాత్రలో నటిస్తున్నట్లు హీరోయిన్ కయాదు లోహార్ తెలిపారు. విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ నానితో కలిసి పనిచేయడం అద్భుతమైన అనుభూతి అని, ఈ సినిమా ప్రేక్షకులకు గొప్ప థియేట్రికల్ అనుభూతిని ఇస్తుందని చెప్పారు.