రాజన్న సిరిసిల్ల జిల్లాలో చెత్త బండి విషయంలో స్వల్ప వాగ్వాదం

రిపోర్టర్: రమేష్ స్థలం: రాజన్న సిరిసిల్ల

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం నీలోజిపల్లి గ్రామంలో ఆదివారం ఉదయం చెత్త బండి విషయంలో స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. గూడ అంజిరెడ్డి ఇంటి వద్ద చెత్త బండిలోని చెత్తను అక్కడే వదిలేయడంతో స్థానికులు, యువత అక్కడకు చేరుకుని వాగ్వాదానికి దిగారు. గ్రామ సర్పంచ్ అనుముల భాస్కర్‌ను సంప్రదించగా చెత్తను నిర్ణీత ప్రదేశంలో వేయాలని సూచించినట్లు సమాచారం. గ్రామంలో పారిశుద్ధ్య సమస్యలు తలెత్తకుండా ప్రతి ఒక్కరూ పంచాయతీ సిబ్బందికి సహకరించాలని స్థానికులు కోరుతున్నారు.