పింఛను దరఖాస్తులకు హౌస్ ట్యాక్స్ నంబర్ మినహాయింపు
రిపోర్టర్: కృష్ణ
స్థలం: అమరావతి
ఎన్టీఆర్ భరోసా పింఛను పథకం కింద సామాజిక భద్రత పింఛను అర్హతకు పట్టణ ప్రాంతాల్లో హౌస్ ట్యాక్స్ ఎసెస్‌మెంట్ నంబర్ నమోదు నుంచి ప్రభుత్వం మినహాయింపునిచ్చింది. వార్డు సచివాలయాల్లో కొత్త పింఛను దరఖాస్తుల సమయంలో ఎదురవుతున్న ఇబ్బందిని గుర్తించి ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. సవరించిన నిబంధనలు బుధవారం నుంచి అమల్లోకి రానున్నట్లు అధికారులు వెల్లడించారు.