రగ్బీలో సంచలనం: న్యూజిలాండ్ జట్టుపై ఘన విజయం సాధించిన భారత అమ్మాయిలు
రిపోర్టర్: సురేష్
స్థలం: రాజ్‌గిర్
న్యూజిలాండ్ అండర్ ఇరవై మహిళల రగ్బీ జట్టుపై భారత జట్టు చారిత్రక విజయం సాధించిందని క్రీడా వర్గాలు తెలిపాయి. రాజ్‌గిర్ ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత అమ్మాయిలు పదిహ సున్నా తేడాతో అద్భుతమైన విజయాన్ని నమోదు చేశారు. ఈ అసాధారణ ప్రదర్శనతో భారత రగ్బీ క్రీడాకారిణులు సరికొత్త చరిత్ర సృష్టించారని, దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుతున్నాయని రగ్బీ ఇండియా ప్రతినిధులు పేర్కొన్నారు.