మహారాష్ట్రలో ఎఫ్డీఏ దాడులు, రూ.20 లక్షల విలువైన కల్తీ ఆహారం సీజ్

రిపోర్టర్: భాస్కర్ స్థలం: மகாராஷ்டிரா

మహారాష్ట్రలోని థానేలో ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు జరిపిన మెరుపు దాడుల్లో రూ.20.48 లక్షల విలువైన కల్తీ ఆహార పదార్థాలు, ముడిసరుకులు సీజ్ అయ్యాయి. ప్రజా ఆరోగ్యంతో చెలగాటమాడితే కఠిన చర్యలుంటాయని ఎఫ్డీఏ కమిషనర్ తుకారామ్ ముండే హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించిన పలు హోటళ్లు, ఈ-కామర్స్ సంస్థల లైసెన్సులు రద్దు చేశారు.