టెన్నిస్ టోర్నీలో భారత్, పాకిస్థాన్ జోడీ విజయం: డబుల్స్ టైటిల్ కైవసం
రిపోర్టర్: కిరణ్
స్థలం: జిబౌటి
జిబౌటి వేదికగా జరిగిన ఐటీఎఫ్ వరల్డ్ టెన్నిస్ టూర్ జూనియర్స్ టోర్నమెంట్లో భారత ఆటగాడు అమ్రిత్ వత్స్ మరియు పాకిస్థాన్ ఆటగాడి ముహమ్మద్ యహ్యా జోడీ అద్భుత ప్రదర్శన కనబరిచి బాయ్స్ డబుల్స్ టైటిల్ను కైవసం చేసుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ తుది పోరులో ప్రత్యర్థులపై ఘన విజయం సాధించి చరిత్ర సృష్టించారని, రోహన్ బోపన్న మరియు ఐసామ్-ఉల్-హక్ ఖురేషీ జోడీని ఈ జంట గుర్తుకు తెచ్చిందని క్రీడా వర్గాలు పేర్కొన్నాయి.