స్థానిక ఎన్నికల ప్రచారం జోరు: కూలీలకు ఉపాధి తోడు ఓటర్ల భారీ డిమాండ్లు

రిపోర్టర్: రాజేష్ స్థలం: నెల్లూరు

జిల్లాలోని నెల్లూరు కార్పొరేషన్ మరియు ఆత్మకూరు, బుచ్చిరెడ్డిపాలెం పురపాలికల్లో ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతోందని ఈనాడు కథనం వెల్లడించింది. ప్రస్తుతం సాగు లేక పనులు లేని వ్యవసాయ కూలీలకు ప్రచారాల ద్వారా ఉపాధి లభిస్తోందని, పురపాలికల్లో ప్రచారానికి వెళ్లే మహిళలకు మూడు వందలు, పురుషులకు ఐదు వందల రూపాయల చొప్పున కూలీ ఇస్తున్నారని తెలిపింది. అలాగే కొన్ని ప్రాంతాల్లో ఓటర్లు తమ ఇంట్లోని ఓట్లకు భారీగా డిమాండ్ చేస్తూ బేరాలకు దిగుతున్నారని సమాచారం.