హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో గంజాయితో సినిమాటోగ్రాఫర్ అరెస్ట్
రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్
స్థలం: హైదరాబాద్
హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 13లోని ఓ హోటల్లో ఈగల్ ఫోర్స్ పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో చెన్నైకి చెందిన 28 ఏళ్ల సినిమాటోగ్రాఫర్ వద్ద 3.8 గ్రాముల గంజాయి లభించింది. మూత్ర పరీక్షల్లో గంజాయి సేవించినట్లు నిర్ధారణ కావడంతో, తక్కువ పరిమాణం కావడంతో పాటు పునరావాసం కోరడంతో అతడిని ఎన్డీపీఎస్ చట్టం కింద వినియోగదారుడిగా పరిగణించి కేసు నమోదు చేసి డి-అడిక్షన్ సెంటర్కు తరలించారు.