'ముందస్తు టిప్‌లు వద్దు': క్యాబ్, బైక్ అగ్రిగేటర్లకు కేంద్రం ఆదేశం

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: భారతదేశం

క్యాబ్‌, బైక్‌ ట్యాక్సీ బుకింగ్‌ సమయంలో ప్రయాణికులను ముందుగానే టిప్‌ చెల్లించమని కోరే విధానంపై కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ నిబంధనల ప్రకారం Uber, Rapido వంటి ప్లాట్‌ఫారమ్‌లలో రైడ్‌ అంగీకరించే ముందు కనిపించే అడ్వాన్స్ టిప్ ఆప్షన్‌ను తొలగించాలని కోరింది. ప్రయాణం పూర్తైన తర్వాత మాత్రమే స్వచ్ఛందంగా టిప్‌ ఇచ్చే అవకాశం ఉండాలని, ముందస్తు చెల్లింపులతో ప్రయాణికులపై ఒత్తిడి తెస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది.