హుగ్గెల్లిలో తాగునీటి సమస్యకు చెక్: నూతన బోరు మోటార్ ఏర్పాటు

రిపోర్టర్: User స్థలం: ఝరాసంగం

సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండల పరిధిలోని హుగ్గెల్లి గ్రామంలో నెలకొన్న తాగునీటి సమస్యను గ్రామ పంచాయతీ త్వరితగతిన పరిష్కరించింది. స్థానిక మఠం సమీపంలోని బోరుబావి వద్ద మరమ్మతులకు గురైన పాత మోటార్ స్థానంలో నూతన విద్యుత్ మోటార్ను సర్పంచ్ పట్లోళ్ల విమల శ్రీనివాస్రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. దీంతో గ్రామంలో తాగునీటి సరఫరా పునరుద్ధరణ జరిగి స్థానిక ప్రజల ఇబ్బందులు తొలగాయి. గ్రామస్తులకు ఎలాంటి నీటి ఎద్దడి రాకుండా చూస్తామని సర్పంచ్ తెలపగా, ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.