పండుగ సీజన్లో భారత్లో కొత్త కార్ల లాంచ్లు ప్రకటించిన ప్రముఖ కంపెనీలు

రిపోర్టర్: గోపి స్థలం: న్యూఢిల్లీ

దీపావళి పండుగ సీజన్ను పురస్కరించుకుని భారత ఆటోమొబైల్ మార్కెట్లో కొత్త కార్ల సందడి మొదలుకానుంది. హోండా, వోల్వో, టాటా మోటార్స్, టయోటా, ఆడి, హ్యుందాయ్ వంటి ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజ కంపెనీలు తమ సరికొత్త మోడళ్లు, ఫేస్లిఫ్ట్ వెర్షన్లు మరియు ఎలక్ట్రిక్ ఎస్యూవీలను మార్కెట్లోకి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. ఈ దీపావళికి కొత్త కారు కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లకు ఈ తాజా కార్ల లాంచ్లతో మార్కెట్లో విభిన్న రకాల ఆప్షన్లు అందుబాటులోకి రానున్నట్లు ఆటో రంగ నిపుణులు వెల్లడించారు.