'బీసీల రాజ్యాధికార సాధనకు నాంది': గోల్కొండలో తీన్మార్ మల్లన్న యాత్ర ప్రారంభం
రిపోర్టర్: అశోక్
స్థలం: హైదరాబాద్
చారిత్రాత్మక గోల్కొండ కోట వేదికగా ఎమ్మెల్సీ, టీఆర్పీ పార్టీ అధినేత తీన్మార్ మల్లన్న చేపట్టిన ‘బీసీ రాజ్యాధికార యాత్ర’ అట్టహాసంగా ప్రారంభమైంది. యాత్రకు ముందు గోల్కొండ కోటపై జగదాంబికా అమ్మవారిని దర్శించుకుని ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి యాత్రను ప్రారంభించిన తీన్మార్ మల్లన్న.. గోల్కొండ గడ్డపై పడిన తొలి అడుగు బీసీల రాజకీయ ఆత్మగౌరవానికి, రాజ్యాధికార సాధనకు నాంది అని స్పష్టం చేశారు. జనాభాలో సింహభాగం ఉన్న బీసీలు కేవలం ఓటు బ్యాంకుగా కాకుండా పాలకుల స్థానంలో నిలబడాలనే లక్ష్యంతోనే ఈ యాత్ర చేపట్టినట్లు తెలిపారు.