టీమిండియాకు గుడ్ న్యూస్: న్యూజిలాండ్ టూర్ లో తిలక్ వర్మ రీఎంట్రీ

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: Auckland

భారత మిడిలార్డర్ బ్యాటర్ తిలక్ వర్మ న్యూజిలాండ్ ఏ జట్టుతో జరిగే మూడో అనధికారిక టెస్టు మ్యాచ్ కు ఎంపికయ్యే అవకాశం ఉందని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. రెడ్ బాల్ క్రికెట్ లో అనుభవం సంపాదించేందుకు సెలక్టర్లు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. నవంబర్ ఏడో తేదీ నుంచి లింకన్ వేదికగా ఈ మ్యాచ్ ప్రారంభం కానుండగా, నవంబర్ ఒకటో తేదీన పేసర్ జస్ప్రీత్ బుమ్రా న్యూజిలాండ్ కు పయనం కానున్నారు.