'పెళ్లి విషయం తెలియకపోతే నేరస్థురాలు కాదు': మద్రాస్ హైకోర్టు కీలక తీర్పు

రిపోర్టర్: రాము స్థలం: తమిళనాడు

భర్తకు అంతకుముందే వివాహమైన విషయం తెలియకుండా అతడిని పెళ్లి చేసుకున్న మహిళ బహుభార్యత్వ నేరస్థురాలు కాదని మద్రాస్ హైకోర్టు జస్టిస్ ఎన్. రమేష్ స్పష్టం చేశారు. మొదటి వివాహాన్ని దాచిపెట్టి మోసగించాడని ముందస్తు బెయిల్ కోరిన మహిళ పిటిషన్ పై విచారణ జరిపిన కోర్టు, భార్యకు పెళ్లి విషయం ముందే తెలుసనే ఆధారాలను ప్రాసిక్యూషన్ చూపలేకపోవడంతో ఆమెకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.