దమ్ముంటే మా స్పిరిట్ సినిమాను ఆపండి: ప్రణయ్ రెడ్డి సవాల్
రిపోర్టర్: రమేష్
స్థలం: తెలంగాణ
రోమాంచకం సినిమాపై వస్తున్న విమర్శలపై నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగా తీవ్రంగా స్పందించారు. కేవలం రివ్యూలతో సినిమా స్థాయిని తగ్గించలేరని, ఆడియెన్స్ ఇచ్చే తీర్పే ఫైనల్ అని అన్నారు. నెగిటివిటీ ఎక్కువ కాలం నిలవదని చెప్పారు. నిజంగా అంత కెపాసిటీ ఉంటే భద్రకాళి పిక్చర్స్ బ్యానర్ నుంచి రాబోయే 'స్పిరిట్' సినిమాను ఆపండంటూ సవాల్ విసిరారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.