నర్సంపేట: విద్యా సంస్థల సమీపంలో బహిరంగంగా పొగాకు ఉత్పత్తుల విక్రయాలు

రిపోర్టర్: T.RAJASHEKAR స్థలం: నర్సంపేట

నర్సంపేట పట్టణంలోని విద్యా సంస్థల సమీపంలో పొగాకు ఉత్పత్తుల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ఇంటర్, డిగ్రీ, బీటెక్ కళాశాలల విద్యార్థుల్లో ధూమపాన అలవాటు పెరుగుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిబంధనలు ఉన్నప్పటికీ అమ్మకాలు ఆగడం లేదని, అధికారులు తనిఖీలు చేపట్టి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.