రాప్తాడు బాలికపై దాడి నిందితుడు హేమంత్ కు తీవ్ర గాయాలు
రిపోర్టర్: సురేష్
స్థలం: అనంతపురం
రాప్తాడు బాలికపై దాడి ఘటనలో నిందితుడిగా ఉన్న హేమంత్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. పోలీసుల కాల్పుల్ లో అతని కుడికాలు తీవ్రంగా దెబ్బతినడంతో పాటు మోకాలి చిప్పలు చిద్రమయ్యాయని తెలిపారు. గాయాల తీవ్రత కారణంగా మోకాలి కింది భాగం నుంచి కుడికాలు తొలగించాల్సిన పరిస్థితి ఉందని వైద్యులు స్పష్టం చేశారు. పరారీలో ఉన్న హేమంత్ ను ఆత్మకూరు అటవీ ప్రాంతంలో గుర్తించి పట్టుకునే క్రమంలో ఈ ఎదురుకాల్పులు జరిగినట్లు పోలీసులు పేర్కొన్నారు.