అమెజాన్‌లో భారీ తగ్గింపుతో ఆపిల్ ఐఫోన్ ఎయిర్

రిపోర్టర్: భాస్కర్ స్థలం: భారతదేశం

ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ వినియోగదారులకు శుభవార్త తెలిపింది. ఆపిల్ ఐఫోన్ ఎయిర్ కొనుగోలుపై రూ. 30 వేల ఫ్లాట్ డిస్కౌంట్‌ను అందిస్తున్నట్లు ప్రకటించింది. ఎస్‌బీఐ, ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుల ద్వారా అదనంగా మరో రూ. 4 వేల తగ్గింపు పొందవచ్చని వెల్లడించింది. పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ ద్వారా రూ. 42 వేల వరకు విలువ లభిస్తుందని పేర్కొంది. ఈ సరికొత్త ఆఫర్ల ద్వారా తక్కువ ధరకే ఐఫోన్ సొంతం చేసుకోవచ్చని స్పష్టం చేసింది.