జూరాల ప్రాజెక్టుకు సాగునీరు విడుదల చేయాలని సీఎం రేవంత్‌రెడ్డికి మంత్రులు విజ్ఞప్తి

రిపోర్టర్: అశోక్ స్థలం: హైదరాబాద్

మహబూబ్‌నగర్ జిల్లా రైతుల సాగునీటి అవసరాల కోసం జూరాల ప్రాజెక్టు నుంచి కాలువల ద్వారా నీటిని విడుదల చేయాలని దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్‌రెడ్డి, మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసి విజ్ఞప్తి చేశారు. స్పందించిన సీఎం కర్ణాటక ముఖ్యమంత్రితో ఫోన్లో మాట్లాడి ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాల నుంచి నీటిని విడుదల చేయాలని కోరారు.