ఆటో కార్మికుడికి అండగా నిలిచిన పువ్వాడ ఫౌండేషన్

రిపోర్టర్: amudala Venkanna స్థలం: ఖమ్మం అర్బన్

ఖమ్మం అర్బన్ పరిధిలో అనారోగ్యంతో కాలు కోల్పోయిన ఆటో కార్మికుడు రెపాకుల మహేష్కు పువ్వాడ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కృత్రిమ కాలును అందజేశారు. మాజీ ఎమ్మెల్యే పువ్వాడ నాగేశ్వరరావు సహకారంతో నాగ్పూర్ నుంచి ఈ కాలును తెప్పించినట్లు నిర్వాహకులు తెలిపారు. మమతా హాస్పిటల్ డైరెక్టర్ పువ్వాడ నరేన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో వివిధ యూనియన్ల నాయకులు పాల్గొన్నారు.