రైలు ప్రయాణంలో బెడ్షీట్లు దొంగిలిస్తూ దొరికిపోయిన దంపతులు
రిపోర్టర్: విజయ్
స్థలం: India
రైళ్లలో బెడ్షీట్లు, దుప్పట్లు దొంగిలించడంపై సోషల్ మీడియాలో ఓ వీడియో తీవ్ర చర్చనీయాంశమైంది. ఏసీ కోచ్‌లో ప్రయాణిస్తూ రైల్వే బెడ్‌రోల్స్‌ను లగేజ్ బ్యాగ్‌లో సర్దుకుంటున్న దంపతులను తోటి ప్రయాణికులు పట్టుకుని నిలదీశారు. టీసీ అదనంగా డబ్బులు వసూలు చేయడమే తాము బెడ్షీట్లు తీసుకోవడానికి కారణమని మహిళ వాదించడం గమనార్హం. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు.