ఎల్ కోట మండలం గోల్జాం గ్రామంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
రిపోర్టర్: శివ
స్థలం: విజయనగరం
పల్లె పండుగ మూడో విడతలో భాగంగా ఎల్ కోట మండలం గోల్జాం గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఘనంగా శంకుస్థాపన చేసినట్లు లలిత కుమారి విజయనగరం వెల్లడించారు. ఈ కార్యక్రమంలో తాను స్వయంగా పాల్గొని పలు అభివృద్ధి పనులకు అంకురార్పణ చేసినట్లు ఆమె తెలిపారు. గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, సంక్షేమంతో పాటు మౌలిక వసతుల కల్పనకు నిరంతరం కృషి చేస్తున్నామని స్థానిక ప్రజల ఎదుట ఆమె స్పష్టం చేశారు.