దుగరాజపట్నం మెగా మారిటైం ప్రాజెక్టు డీపీఆర్‌కు ఏడు దిగ్గజ సంస్థల పోటీ
రిపోర్టర్: రమేష్
స్థలం: ఆంధ్రప్రదేశ్
ఏపీలోని దుగరాజపట్నం మెగా మారిటైం ప్రాజెక్టు నిర్మాణంలో కీలక అడుగు పడింది. పోర్టు, షిప్‌బిల్డింగ్ క్లస్టర్ డీపీఆర్ రూపకల్పన కోసం ఏడు అంతర్జాతీయ, జాతీయ సంస్థలు పోటీపడుతున్నాయి. టెక్నికల్ బిడ్ల పరిశీలన అనంతరం ఎల్-1 సంస్థను ఎంపిక చేయనున్నారు. ఎంపికైన కన్సల్టెంట్ 15 నెలల్లో సమగ్ర నివేదికను సమర్పించాల్సి ఉంటుంది. 2,200 ఎకరాల్లో నేషనల్ షిప్‌బిల్డింగ్, హెవీ ఇండస్ట్రీస్ పార్కుతో పాటు పోర్టుల నిర్మాణం కోసం ఈ ప్రణాళిక రూపుదిద్దుకుంటోంది.