రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్ అప్రజాస్వామికం: డీకే శివకుమార్
రిపోర్టర్: కిరణ్
స్థలం: కర్ణాటక
హల్ద్వానీలో రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడం ప్రజాస్వామ్య ఖూనీ అని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మండిపడ్డారు. దళితుల గొంతుకను, వారి ఆత్మగౌరవాన్ని అణిచివేసేందుకే బీజేపీ కుట్ర పన్నుతోందని ఆరోపించారు. దేశంలో ప్రజాస్వామ్యం బతికిలేదని, ప్రతిపక్షాల గొంతునొక్కే ప్రయత్నం చేస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.