డిజిటల్ అరెస్ట్ పేరుతో మోసం: మాజీ శాస్త్రవేత్తకు కోటి పాతిక లక్షల టోకరా
రిపోర్టర్: వెంకట్
స్థలం: ఢిల్లీ
ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వ శాఖ మాజీ సంచాలకుడు ప్రదీప్ కుమార్ దాస్‌ను డిజిటల్ అరెస్ట్ పేరుతో సైబర్ నేరగాళ్లు కోటి ఇరవై ఐదు లక్షల రూపాయలు మోసగించారని ఢిల్లీ పోలీసులు తెలిపారు. బాధితుడి ఆధార్ కార్డు దుర్వినియోగం అయిందని బెదిరించి, ఈ ఆర్టీజీఎస్ ద్వారా డబ్బులు బదిలీ చేయించుకున్నారని అధికారులు వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించి ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశామని, అంతర్జాతీయ సిండికేట్ కోణంలో దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు స్పష్టం చేశారు.