ఈసీ నిర్ణయంపై రాహుల్ గాంధీ ధ్వజం: బీజేపీకి తొత్తుగా మారారంటూ ఫైర్

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: న్యూఢిల్లీ

ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ ‘ఇండియా’ కూటమి ఎంపీలు ఢిల్లీలో భారీ నిరసన మార్చ్ చేపట్టారు. ఓటర్ల జాబితా సవరణలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ పార్లమెంట్ నుంచి నిర్వాచన్ సదన్ వరకు పాదయాత్ర నిర్వహించారు. ఈ నిరసన నేపథ్యంలో ఢిల్లీలో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేసి బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత పాటించాలని కూటమి నేతలు స్పష్టం చేశారు.