తమ్ముడి మోసంపై శాయంపేటలో వృద్ధురాలు సంచలన ఆరోపణలు
రిపోర్టర్: సతీష్
స్థలం: శాయంపేట
కష్టకాలంలో అండగా ఉంటానని నమ్మించిన సొంత తమ్ముడే తనను మోసం చేశాడని మైలారం గ్రామానికి చెందిన నాలిక సరోజన ఆవేదన వ్యక్తం చేశారు. శాయంపేట మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, ఏఎస్ఐగా పనిచేస్తున్న తన తమ్ముడు రాజమౌళి మాటలు నమ్మి ముప్ పై ఐదు గుంటల భూమిని కోడలు పేరుపై పట్టా చేయించానని తెలిపారు. అయితే ఆ భూమిని ఆక్రమించుకోవడంతో పాటు తుపాకీతో కాల్చి చంపుతానని బెదిరిస్తున్నాడని కన్నీటిపర్యంతమయ్యారు. తనకు తగిన న్యాయం చేయాలని పోలీసు ఉన్నతాధికారులను కోరారు.