నేపాల్‌లో భారీ కొండచరియలు: చౌలానీ నదికి ఆకస్మిక వరద ముప్పు

రిపోర్టర్: భాస్కర్ స్థలం: నేపాల్

నేపాల్‌లోని దార్చులా జిల్లా అపీ హిమాల్ ప్రాంతంలో భారీగా కొండచరియలు విరిగిపడటంతో చౌలానీ నది ప్రవాహానికి తీవ్ర ఆటంకం ఏర్పడింది. నదిలో వ్యర్థాలు పేరుకుపోవడంతో నీరు నిలిచిపోయి, ఆకస్మిక వరదలు వచ్చే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు. నదీ తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని జిల్లా యంత్రాంగం అత్యవసర ఆదేశాలు జారీ చేసింది.