బీజేపీతో ఎలాంటి పొత్తు ఉండబోదంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పష్టీకరణ

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: Hyderabad

బీజేపీతో తమ పార్టీకి ఎలాంటి పొత్తు ఉండబోదని బీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. బీజేపీ, కాంగ్రెస్ల దుష్ట రాజకీయాలను ప్రజల గమనిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం విశ్వసనీయత ప్రశ్నార్థకంగా మారిందని, దీనిపై సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలపై యువత ప్రశ్నిస్తుంటే కేంద్ర ప్రభుత్వం వాటిని పక్కదారి పట్టిస్తోందని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, కేసీఆరే మళ్లీ ముఖ్యమంత్రి అవుతాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.