క్యాన్సర్ చికిత్సలో గుండె ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని నిపుణుల సూచన

రిపోర్టర్: విజయ్ స్థలం: తెలంగాణ

క్యాన్సర్ చికిత్స సమయంలో రోగుల గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎంతో కీలకమని డాక్టర్ నూతన్ కుమార్ తెలిపారు. ఆధునిక వైద్యంలో కీమోథెరపీ, రేడియేషన్ వంటి చికిత్సలు గుండెపై దుష్ప్రభావం చూపే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. చికిత్సకు ముందే గుండె పరీక్షలు చేయించుకోవడం ద్వారా ముప్పును ముందే గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవచ్చని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.