కొవ్వూరు వద్ద పట్టాలు తప్పిన గూడ్సు రైలు, నిలిచిన రాకపోకలు

రిపోర్టర్: రాజేష్ స్థలం: తూర్పు గోదావరి

తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు సమీపంలో గూడ్సు రైలు పట్టాలు తప్పడంతో రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. ఒడిశా నుంచి మహారాష్ట్ర వెళ్తున్న రైలు వ్యాగన్లు పట్టాలు తప్పడంతో పలు ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ రైళ్లు నిలిచిపోయాయి. రత్నాచల్ సహా కొన్ని రైళ్లను రద్దు చేశారు. 12 రోజుల వ్యవధిలో అదే ప్రాంతంలో రెండోసారి ప్రమాదం జరగడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అధికారులు పునరుద్ధరణ పనులు చేపట్టారు.