ఖమ్మంలో ముస్తఫానగర్ వద్ద ప్రశాంతంగా గణేష్ నిమజ్జన శోభాయాత్ర
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: ఖమ్మం అర్బన్
ఖమ్మం ముస్తఫానగర్ చౌరస్తా వద్ద బుధవారం గణేష్ నిమజ్జన శోభాయాత్రను సీపీ సునీల్ దత్ సుడా ఛైర్మన్ పువ్వాళ్ల దుర్గాప్రసాద్, మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య ప్రారంభించారు. తొమ్మిది రోజుల ఉత్సవాలకు సహకరించిన భక్తులు, ఉత్సవ కమిటీలకు సీపీ కృతజ్ఞతలు తెలిపారు. ధంసలాపురం చెరువు వద్ద నిమజ్జన ఏర్పాట్లు, భద్రతా చర్యలను అధికారులు పర్యవేక్షించారు. నిమజ్జనం పూర్తయ్యే వరకు అధికారులు అందుబాటులో ఉంటారని తెలిపారు.