కౌన్సిలింగ్
*రౌడీ షీటర్లు, నేరచరిత్ర గల వ్యక్తులకు కౌన్సిలింగ్ నిర్వహిస్తున్న చిత్తూరు జిల్లా పోలీసుల.*
*నేరాలకు పూర్తిగా దూరంగా ఉండాలని స్పష్టం చేసిన జిల్లా పోలీసులు*
*చిత్తూరు జిల్లా ఎస్పీ శ్రీ తుషార్ దూడి, ఐపిఎస్ గారి ఆదేశాల మేరకు, జిల్లాలో నేర నియంత్రణను మరింత బలోపేతం చేయడంతో పాటు శాంతిభద్రతలను కాపాడే దిశగా జిల్లా పోలీసు శాఖ కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది.*
ఈ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్న రౌడీ షీటర్లు, నేరచరిత్ర గల వ్యక్తులు, చెడు నడత కలిగిన వారిని పోలీస్ స్టేషన్లకు పిలిపించి ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహించారు.
కౌన్సిలింగ్ సందర్భంగా పోలీసు అధికారులు మాట్లాడుతూ సమాజంలో ప్రతి ఒక్కరు చట్టాన్ని గౌరవిస్తూ సత్ప్రవర్తనతో జీవించాలని, నేరప్రవర్తనకు పూర్తిగా స్వస్తి పలకాలని స్పష్టం చేశారు. చిన్న చిన్న కారణాలతో గొడవలు, దాడులు, బెదిరింపులు వంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడకుండా కుటుంబ సభ్యులతో కలిసి శాంతియుతంగా, గౌరవప్రదంగా జీవనం సాగించాలని సూచించారు.
అలాగే గతంలో నేరాలకు పాల్పడిన వారు తమ ప్రవర్తనలో మార్పు తీసుకుని మంచి పౌరులుగా మారాలని, సమాజంలో మంచి పేరు సంపాదించాలని హితవు పలికారు.
భవిష్యత్తులో ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, రౌడీ షీటర్ల కదలికలపై పోలీసుల నిఘా నిరంతరం కొనసాగుతుందని హెచ్చరించారు.
జిల్లాలో శాంతియుత వాతావరణం నెలకొల్పడం, ప్రజల భద్రతను పరిరక్షించడం పోలీసు శాఖ ప్రధాన బాధ్యతగా భావిస్తూ చిత్తూరు జిల్లా పోలీసులు ఇలాంటి అవగాహన కార్యక్రమాలు, నియంత్రణ చర్యలను నిరంతరం కొనసాగిస్తారని తెలిపారు.