లేబర్ కోడ్ల రద్దుకై రైల్వేకోడూరులో గళమెత్తిన ఏఐటీయూసీ కార్మిక శ్రేణులు
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: రైల్వే కోడూరు
ఏఐటీయూసీ నూట ఏడో ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రైల్వేకోడూరులో ఆ సంఘం ఆధ్వర్యంలో పలు చోట్ల ఘనంగా జెండా ఆవిష్కరణలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ అధ్యక్షుడు మాదరాజు గంగాధర్, ప్రధాన కార్యదర్శి దాసరి జయచంద్ర పాల్గొని మాట్లాడారు. నాలుగు లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ కోసం కార్మికులంతా ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.