ఇరాన్ విమానాలకు సహకరిస్తే కఠిన చర్యలు తప్పవని అమెరికా హెచ్చరిక
రిపోర్టర్: కృష్ణ
స్థలం: World
ఇరాన్‌తో సైనిక ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా ఆ దేశంపై ఆర్థిక ఆంక్షలను మరింత బిగించింది. ప్రపంచవ్యాప్తంగా ఇరానియన్ ఎయిర్‌లైన్స్ సర్వీసులను పూర్తిగా నిలిపివేసేలా యూఎస్ ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ పటిష్ట హెచ్చరికలు జేశారు. ఇరాన్ విమానాలకు విదేశీ విమానాశ్రయాల్లో ల్యాండింగ్ అనుమతులు, ఇంధన సరఫరా లేదా టికెట్ల విక్రయాలు వంటి సేవలు అందిస్తే కఠినమైన సెకండరీ శాంక్షన్స్ ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన స్పష్టం చేశారు. అమెరికా హెచ్చరికలను దిక్కరించి ఇరాన్ విమానాలకు సహకరిస్తే ఆ విదేశీ సంస్థలను లేదా దేశాలను డాలర్ సిస్టమ్ నుంచి పూర్తిగా తొలగిస్తామని గట్టిగా తేల్చి చెప్పారు.