సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న శర్వానంద్ జార్జ్ క్రిష్ చిత్రం

రిపోర్టర్: కిరణ్ స్థలం: హైదరాబాద్

టాలీవుడ్ స్టార్ శర్వానంద్ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న జార్జ్ క్రిష్ సినిమా ఫస్ట్ గ్లింప్స్ను మేకర్స్ విడుదల చేశారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో మానస వారణాసి నాయికగా నటిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు.