కేంద్రంపై రేవంత్ రెడ్డి నిప్పులు: ప్రజాస్వామ్య వ్యవస్థలను నాశనం చేస్తున్నారంటూ ధ్వజం

రిపోర్టర్: భాస్కర్ స్థలం: తెలంగాణ

కేంద్ర ప్రభుత్వం మరియు ఎన్నికల సంఘం పనితీరుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారని అధికార వర్గాలు వెల్లడించాయి. ప్రజాస్వామ్య వ్యవస్థలను దుర్వినియోగం చేస్తూ దేశంలో విలువలను కాలరాస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. సీబీఐ, ఈడీలను అస్త్రాలుగా మల్చుకుని గెలవాలని చూస్తున్నారని విమర్శించారు. దేశవ్యాప్తంగా పదమూడు కోట్ల ఓట్లను తొలగించడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని రేవంత్ రెడ్డి ఆరోపిస్తూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.