హైడ్రా కొరడా: మాజీ మంత్రి మల్లారెడ్డి ఫామ్ హౌస్ ప్రహరీ కూల్చివేత

రిపోర్టర్: కృష్ణ స్థలం: Hyderabad

మాజీ మంత్రి మల్లారెడ్డి కుటుంబ సభ్యులకు చెందిన ఫామ్ హౌస్ పై హైడ్రా అధికారులు సంచలన చర్యలు చేపట్టారు. ఫాక్స్ సాగర్ చెరువు ఎఫ్ టీఎల్ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ప్రహరీ గోడతో పాటు ప్రధాన గేటును బుల్డోజర్లతో కూల్చివేశామని అధికారులు వెల్లడించారు. చెరువులను ఆక్రమణల నుంచి కాపాడి పూర్వ వైభవం తీసుకురావడమే తమ లక్ష్యమని హైడ్రా స్పష్టం చేసింది.