మానవాళిని అంతం చేసేలా ఏఐ దూకుడు: పరిశోధకుడి సంచలన హెచ్చరిక
రిపోర్టర్: రాజేష్
స్థలం: World
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మానవాళి మనుగడకే పెను ముప్పుగా మారుతోందని ఏఐ పరిశోధకుడు జాకబ్ కాక్సన్ సంచలన ఆరోపణలు చేశారు. పోటీలో వెనుకబడిపోతామనే భయంతో ఏఐ సంస్థలు ప్రజల జీవితాలతో జూదమాడుతున్నాయని మండిపడ్డారు. వచ్చే పదేళ్లలో ఏఐ మనుషులందరినీ అంతం చేసే సూపర్ ఇంటెలిజెన్స్‌గా మారే ప్రమాదముందని హెచ్చరించారు. టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం ఆందోళన కలిగిస్తోంది.