మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ పై కేసు నమోదు
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: వరంగల్
వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి దగ్గర జరిగిన ఘటనపై మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ తో పాటు మరో 15 మంది బీఆర్ఎస్ నాయకులపై మట్టేవాడ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఎస్ఐ శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు BNNS 132, 121, 189, 190, 126, 351 సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.