ఆస్ట్రేలియా క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ ఆల్ రౌండర్ గ్లెన్ మాక్స్ వెల్
రిపోర్టర్: మహేష్
స్థలం: Melbourne
అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించినట్లు ఆస్ట్రేలియా స్టార్ ఆల్ రౌండర్ గ్లెన్ మాక్స్ వెల్ వెల్లడించారు. తన సుదీర్ఘ కెరీర్ లో ఎన్నో అద్భుత విజయాలను సాధించానని, ఆస్ట్రేలియా జట్టుతో కలిసి మూడు ప్రపంచకప్ ట్రోఫీలను గెలవడం మరువలేని అనుభూతినని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్తులో యువ ఆటగాళ్లకు అవకాశాలు కల్పించాలనే బోర్డు నిర్ణయాన్ని తాను గౌరవిస్తున్నానని, ఇకపై పూర్తిగా బిగ్ బాష్ లీగ్ పైనే దృష్టి సారిస్తానని మాక్స్ వెల్ స్పష్టం చేశారు.