మృత్యువులా వేలాడుతున్న విద్యుత్ తీగలతో వణికిపోతున్న పల్లెజనం
రిపోర్టర్: G Satyam🌹
స్థలం: చింతపల్లి
అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం కోడిమిసార పంచాయితీ పరిధిలోని తురుబొమ్మలు రోడ్డు వద్ద ప్రమాదకరంగా విద్యుత్ వైర్ తెగిపడి కాలిపోతోంది. దీనివల్ల ఎప్పు ఏం జరుగుతుందోనని స్థానిక గ్రామస్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే సంబంధిత లైన్మెన్ స్పందించి విద్యుత్ సరఫరా నిలిపివేసి, వైర్లను సరిచేయాలని కోరుతున్నారు. లేనిపక్షంలో పెను ప్రమాదం ముప్పు పొంచి ఉందని, అధికారులు తక్షణమే స్పందించాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.