సీఈసీ జ్ఞానేశ్ కుమార్ తొలగింపు కోరుతూ కాక్రోచ్ జనతా పార్టీ నేతల నిప్పులు

రిపోర్టర్: గోపి స్థలం: ఢిల్లీ

సీఈసీ జ్ఞానేశ్ కుమార్ ను కాపాడేందుకు ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా దేశ ప్రజలతో యుద్ధం చేస్తున్నారని సీజేపీ నేతలు సౌరవ్ దాస్, అశుతోశ్ రంకా మండిపడ్డారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ, జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేసేంతవరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. నిర్బంధాలు, కేసులతో తమ గొంతును నొక్కలేరని, దేశంలో ఎమర్జెన్సీ పరిస్థితులను తలపించేలా పాలన సాగుతోందని వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.