చెల్లని చెక్కుల కేసులో నిందితుడికి ఏడాది జైలుశిక్ష విధిస్తూ ఖమ్మం కోర్టు సంచలన తీర్పు
రిపోర్టర్: Narendra kumar kinnera
స్థలం: ముదిగొండ
ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం మల్లారం గ్రామానికి చెందిన నాదెండ్ల వరప్రసాదరావు, కవిరాజ్నగర్కు చెందిన రావూరి వెంకటరంగారావు వద్ద రూ.15 లక్షలు అప్పుగా తీసుకున్నారు. తీసుకున్న అప్పును చెల్లించేందుకు ఇచ్చిన నాలుగు చెక్కులు ఖాతా బ్లాక్ కావడంతో బౌన్స్ అయ్యాయి. దీంతో బాధితుడు కోర్టులో కేసు వేశారు. ఈ కేసును విచారించిన న్యాయమూర్తి బిక్కం రజిని నాలుగు కేసుల్లో ఏడాది చొప్పున, మరో కేసులో ఆరు నెలల జైలుశిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు.