చింతకుంటలో గణేష్ నిమజ్జనం కోసం నీటిని ఇవ్వాలంటూ బండి సంజయ్ నిలదీత
రిపోర్టర్: మహేష్
స్థలం: Chinthakunta
కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ నేత బండి సంజయ్ కుమార్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చింతకుంటలో గణేష్ నిమజ్జనం కోసం తక్షణమే నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ చలో చింతకుంట కార్యక్రమం చేపట్టారు. ప్రభుత్వం అవలంబిస్తున్న నిర్లక్ష్య వైఖరిని ఆయన తీవ్రంగా ఎండగట్టారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ తీరును తీవ్రంగా ఖండిస్తూ నిరసన తెలిపారు.