నవ్వుల విప్లవంతో వస్తున్న శ్రీవిష్ణు 'కామ్రేడ్ కళ్యాణ్' టీజర్ విడుదల
రిపోర్టర్: నరేష్
స్థలం: Andhra Pradesh
టాలీవుడ్ హీరో శ్రీవిష్ణు నటిస్తున్న పీరియడ్ యాక్షన్ కామెడీ 'కామ్రేడ్ కళ్యాణ్' టీజర్ విడుదలైంది. 1990ల నాటి మాడుగుల నేపథ్యంలో సాగే ఈ చిత్రం అక్టోబర్ 9న విడుదల కానుంది. నక్సలిజం నేపథ్యంలో వినోదాన్ని పంచుతూ శ్రీవిష్ణు చెప్పిన డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. జానకిరామ్ మారెళ్ల దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో మహిమా నంబియార్ హీరోయిన్గా నటిస్తుండగా, కోన వెంకట్ సమర్పిస్తున్నారు.