ప్రభుత్వాసుపత్రులకు 172 రకాల ఔషధాలు సరఫరా చేస్తున్న కూటమి ప్రభుత్వం

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: నెల్లూరు

రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులకు అవసరమైన 172 రకాల ఔషధాలను కూటమి ప్రభుత్వం సరఫరా చేస్తోందని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. నెల్లూరు జిల్లా ప్రభుత్వాసుపత్రి ప్రాంగణంలో ఉన్న కేంద్రీయ మందుల గిడ్డంగి ద్వారా జిల్లావ్యాప్తంగా ఉన్న ఆసుపత్రులు, పట్టణ ఆరోగ్య కేంద్రాలకు మందులు పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మందుల నిల్వలు, వినియోగం వివరాలను ఈ-ఔషధి యాప్లో నమోదు చేస్తున్నామని, తద్వారా లోటుపాట్లు లేకుండా తగిన మందులు కేటాయిస్తున్నామని అధికారులు వెల్లడించారు.