ఎన్నికల నేపథ్యంలో అంబేద్కర్ వర్సిటీకి రెండు రోజులు సెలవులు ఖరారు
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: ఎచ్చెర్ల
శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ కి ఈ నెల నాలుగు, ఐదు తేదీల్లో రెండు రోజుల పాటు సెలవులు ప్రకటిస్తున్నట్లు వర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ అడ్డయ్య మంగళవారం తెలిపారు. ఎన్నికల కమిషనర్ ఆదేశాల మేరకు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో ఈ సెలవులు ఇస్తున్నామని అధ్యాపకులు, విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని ఆయన స్పష్టం చేశారు.